మనిషి రూపంలో దూడ.. విష్ణు మూర్తేనంటూ పూజలు

ఓ వింత ఘటన చోటు చేసుకుంది. జన్మించిన దూడ మనిషి రూపంలో ఉంది. దీంతో విష్ణుమూర్తి ప్రతిరూపంగా జనం భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో ఈ విచిత్రం చోటు చేసుకుంది. ఇక అంతే రెండు రోజులుగా పండుగ వాతావరణం నెలకొంది. ఆ ఊరులోని రాజా మిశ్రా అనే వ్యక్తికి ఓ గోవు ఉంది. రెండు రోజుల క్రితం ఓ దూడ జన్మించింది. పుట్టిన దూడ ముఖం అచ్చం మనిషిని పోలి ఉంది. పోలికలు అచ్చం విష్ణుమూర్తి వరాహ అవతారంలోని ఆకారంలో ఉన్నాయి. మనిషికి ఉన్నట్లే ముక్కు, చెవులు, కళ్లు ఉన్నాయి భలేగా. అయితే దారుణం ఏమిటంటే పుట్టిన వెంటనే చనిపోయింది ఈ లేగదూడ. ఈ విషయం తెలిసిన జనం తండోపతండాలుగా మిశ్రా ఇంటికి క్యూ కట్టారు.
ఆ రోజు మొదలు..
దండలు వేసి దండాలు పెడుతున్నారు. పూజలు చేస్తున్నారు. భజనలు కూడా చేస్తున్నారు. చూసిన జనం అంతా విష్ణుమూర్తి మళ్లీ పుట్టాడని ఉవ్వెత్తున ప్రచారం సాగిస్తుండడంతో వందల కిలో మీటర్ల నుంచి వచ్చి కూడా పూజలు ఆచరిస్తున్నారు.. దీంతో అది యూట్యూబ్ కి ఎక్కేసింది. ఇక అంతే ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం అమితాశ్చర్యకరమైన అంశంగా మారింది. జనం వేలల్లో వచ్చి చూస్తుండడంతో చనిపోయిన లేగదూడను ఖననం చేయలేదు. ఫ్రిజర్ బాక్స్ లో పెట్టారు. మూడు రోజులు ప్రజల సందర్శనార్ధం ఉంచారు. మూడు రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని గుడి కట్టిస్తామని ప్రకటించారు గ్రామస్తులు. ఆవిశేషాల సమాహారంతో కూడిన వీడియోను చూడాలనుకుంటే మీరూ కింద క్లిక్ చేయండి..