షాకింగ్ వీడియో: ఫోన్లో మాట్లాడుతూ ట్రైన్ క్రింద పడ్డ అమ్మాయి.. కాని

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ అనేది సర్వ సాధారణ విషయం. అయితే యువతకు మాత్రం చేతిలో ఫోన్ ఉంటె చాలు ప్రపంచాన్నే మర్చిపోతారు. దాని వాళ్ళ ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కొందరు ఫోటోలు తీసుకోవాలని ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే.. ఇంకొందరు ఫోన్లలో మాట్లాడుతూ చుట్టుపక్కల ఏమి జరుగుతుందో కూడా పట్టించుకోకుండా వెళుతున్నప్పుడు జరగరాని ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటనే ముంబై లో చోటుచేసుకుంది. కుర్లా రైల్వే స్టేషన్ లో ఓ అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతూ పట్టాలు దాటబోయింది. అయితే ట్రాక్ లో ట్రైన్ వస్తున్న సంగతి మరచిపోయింది. అయితే ఆ అమ్మాయిని చూసిన తోటి ప్రయాణీకులు గట్టిగా అరిచారు. అప్పుడు అమ్మాయి అలర్ట్ అయ్యి ప్లాట్ ఫామ్ దగ్గరికి వచ్చింది. కానీ ఎక్కలేకపోతానేమో అనుకుని...
ట్రాక్ ను దాటేద్దామని అనుకుంది. అప్పటికే సమయం దాటిపోయింది. ఆమె దాటే లోపు ట్రైన్ గుద్దేసింది. ఒక్క ఉదుటున ఆమె ట్రైన్ కు గుద్దుకుని పట్టాలపై పడిపోయింది. అంతా అమ్మాయి చనిపోయుంటుందని అనుకున్నారు. కాని అంత పెద్ద ప్రమాదం జరిగిన కూడా ఆమె చిన్నపాటి గాయాలతో చావు నుంచి బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స చేయించిన రైల్వే పోలీసులు ఆ అమ్మాయిని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ అమ్మాయి పట్టాలు దాటే సమయంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణీకులు అన్నారు. ఫోన్ మాట్లాడుతూ ఉండిపోయింది కానీ ఎదురుగా ట్రైన్ వస్తున్న సంగతి కూడా గమనించలేదని వారు అంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆమె లాగే అదృష్టవంతులు ఉండరు. కాబట్టి జాగ్రతగా ఉండటం బెటర్.