బుద్ధి ఉన్నవాడు ఎవ్వడూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఉండడు - రామ్ గోపాల్ వర్మ !

అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి .. తెలుగు రాష్ట్రాల యువత కలవరిస్తున్న పేరు ఇదే మరి. మొదటి వారాంతం పూర్తి అయ్యి రెండో వరం వైపు పరుగులు తీస్తున్నా కూడా ఈ సినిమాకి ఇంకా వసూళ్లు తగ్గడం లేదు థియేటర్ ఓ టికెట్లు కూడా దొరకడం లేదు.
ఒక బ్రేకప్ లవ్ స్టోరీ ని జనం రిసీవ్ చేసుకున్న తీరు చూస్తే యూత్ లో ప్రేమ పట్ల ఇంత క్రేజ్ ఉందా అనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైన ఒక లవ్ లైన్ తో గుండెలు పిండేసేలా నడిచే కథనం అర్జున్ రెడ్డి కి ప్రాణం .వీటన్నిటికీ విజయ్ దేవరకొండ తమ నటన తో అర్జున్ రెడ్డి పాత్ర లో అదుర్స్ అనిపించాడు.
తెలుగు లో చాలా మంది హీరోలు చూసి నేర్చుకోవాల్సిన నటుడు ఇతనే అంటూ విమర్శకులు విజయ్ దేవరకొండ ని చూపిస్తున్నారు. వారికి జత కట్టారు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అలవాటు ఉన్న వర్మ తన ఫేస్ బుక్ లో ఏకంగా పవన్ కళ్యాణ్ నీ విజయ్ దేవరకొండ నీ కంపేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు.
"‘తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏ వ్యక్తి అయినా ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండకు కాకుండా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గా ఉంటారా! అలా ఎవరైనా ఉంటే, వారు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం, మోసం చేసినవాళ్లు అవుతారే తప్పా, మరేమీ కారు." అన్నారు. బుద్ధి ఉన్నవాడు ఎవ్వడూ ఈ సినిమా చూసాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఉండడు అన్నారు ఆయన.