Dj-'దువ్వాడ జగన్నాధం' - రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: Dj-దువ్వాడ జగన్నాధం
తారాగణం: అల్లు అర్జున్,పూజా హెగ్డే, బ్రహ్మానందం, రావు రమేష్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకత్వం: హరీష్ శంకర్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: దిల్ రాజు
సరైనోడు సూపర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఎస్.హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలుగా రూపొందిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ `డీజే దువ్వాడ జగన్నాథమ్` ఈ రోజు విడుదలయింది..బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు..ఈ సినిమా రీవ్యూ ఎలా ఉందో చూద్దాం..
కధ:
ఓ పాలెస్ లో వంట వాడిగా చేస్తుంటాడు బ్రాహ్మణుడు అయిన “దువ్వాడ జగన్నాధం”. అక్కడ జరిగే ఈవెంట్స్ అన్ని అతనే చూసుకుంటూ ఉంటాడు. అలా ఒక సందర్భంలో “పూజ హెగ్డే” ను కలుస్తాడు. ఆ అమ్మాయి ప్రేమలో పడిన తర్వాత అతని జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఇంతలో డీజే (అల్లు అర్జున్ డ్యూయల్ రోల్) తెరపైన కనిపిస్తాడు. అతను ఓ వెల్ఫేర్ కమ్యూనిటీ కి హెడ్. రియల్ ఎస్టేట్ లో జరుగుతన్న స్కాం పై పోరాడుతుంటాడు. న్యాయం కోరిన ప్రజలకు అండగా నిలుస్తాడు. అసలు డీజే కి దువ్వాడ జగన్నాధం కి సంబంధం ఏంటి..? పూజ హెగ్డే ప్రేమ కథ ఎలా ముగుస్తుంది? ల్యాండ్ మాఫియా చేసేది ఎవరు..? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే దువ్వాడ జగన్నాధం సినిమా చూడాల్సిందే!
నటీ నటుల అభినయం:
అల్లు అర్జున్ యాక్టింగ్ ఇరగదీసాడు..అల్లు అర్జున్ అన్ని సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా డాన్స్ అదరగొట్టేసాడు. హీరోయిన్ పూజా హగ్దే… ముకుంద , ఒక లైలా కోసం చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను పలకరించినప్పటికీ డీజే లో మాత్రం కొత్త పూజా కనిపించిందని , లుక్స్ , యాక్టింగ్ లతో ఆకట్టుకుంది. ,ముఖ్యం గా డాన్స్ లలో అయితే బన్నీ కి సమానంగా చేసింది..రావు రమేష్ పాత్ర ఆ ఒక్కటీ అడక్కు లో రావుగోపాల రావు పాత్రను పోలి ఉంది..వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ మరోసారి నవ్వించింది..మిగతా నటీ నటుల తమ పరిధి మేరకు బాగానే నటించారు..
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు హరీష్ శంకర్ ఆకుట్టుకునే స్క్రీన్ ప్లే ప్రేక్షకులను అలరించింది..దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరో ఎత్తుకి తీసుకెళ్లింది. అజయంకా బోస్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్..చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువలు ఒక రేంజ్ లో ఉన్నాయి..
ప్లస్ పాయింట్స్:
అల్లు అర్జున్ ఆక్టింగ్
పూజ హెగ్డే గ్లామర్
హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం
హరీష్ శంకర్ డైలాగ్స్
క్లైమాక్స్
కామెడీ
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
తెలుగు మెసెంజర్ రేటింగ్: 3/5