బ్రేకింగ్ : ‘డీజే’ థియేటర్ ముందు ఫ్యాన్ ఆత్మహత్య యత్నం

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘డీజే’ చిత్రం నిన్న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. ఫ్యాన్స్ మాత్రం సినిమా బాగుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు పాటలో కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బ్రహ్మణ సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆ పాటలోని పదాలను వేరే పదాలతో రీప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు సినిమా విడుదలైన తర్వాత బ్రహ్మణులు మరో వివాదాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు.
‘డీజే’ చిత్రంలో అల్లు అర్జున్ చెప్పులు వేసుకుని గాయత్రి మంత్రంను పఠించాడు అని, చెప్పులు వేసుకుని పరమపవిత్రంగా భావించే గాయత్రి మంత్రం చదివినందుకు గాను సినిమాను బ్యాన్ చేయాలి అంటూ బ్రహ్మణ సంఘాల వారు ఆందోళన మొదలు పెట్టారు. ఈ సమయంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా బ్రహ్మణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన మొదలు పెడుతున్నారు. నిన్న సాయంత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ హైదరాబాద్‌లో ‘డీజే’ సినిమా ప్రదర్శించబడుతున్న ఒక థియేటర్ వద్ద బ్రహ్మణులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఆ సమయంలోనే ఒక అభిమాని బ్రహ్మణుల తీరుకు నిరసనగా ఆత్మహత్య చేసుకునేందుకు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో అక్కడే ఉన్న ఇతర అభిమానులు అడ్డుకున్నారు.