రాజమౌళికి ఆ విషయం మాట్లాడే దమ్ముందా?
ఈగ చిత్రం కాన్సెప్ట్ దగ్గర్నుంచి సీన్ల వరకు చాలా వాటినుంచి కాపీ కొట్టారు. బాహుబలిలో కూడా కాపీ సీన్లు, షాట్లు చాలానే వున్నాయి. తనకింద ఇంత నలుపు పెట్టుకుని, ఒక అగ్ర నిర్మాతపై ఇలాంటి వ్యాఖ్యలు పబ్లిక్‌గా చేయడం ఎంతవరకు సబబు అనేది ఇప్పుడు చాలా మంది సంధిస్తోన్న ప్రశ్న. సెంటర్లు పెంచి వేసుకోవడమనేది అప్పట్లో ఒక పిచ్చి.
అభిమానుల ఆనందం కోసం నిర్మాతలు ఆబ్లిగేషన్‌పై అవి వేసేవారు. ఆ సంగతి అందరికీ తెలిసిన సంగతే అయినప్పటికీ దానిని భూతద్దంలో చూపించి, అల్లు అరవింద్‌ని బ్యాడ్ లైట్‌లో చూపించడం రాజమౌళికి ఎంతవరకు సబబు? తను, తన అన్న కీరవాణి చేసే మేథోచౌర్యం కంటే పెద్ద అఫెన్సా ఇది? ఈ రికార్డుల వల్ల ఎవరికీ నష్టం వుండదు కానీ, అవతలి వాడి క్రియేటివిటీని దొంగిలించడం కరెక్టా మరి?
