హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు షాక్..!


అదిఒక ఐటీ కంపెనీ. తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌ కంపెనీలను ప్రోత్సహించడంతో పుట్టుకొచ్చిన కంపెనీ. మూడు నెలల క్రితమే ప్రారంభమైంది. ఏమైందో తెలిదు ఏమో ఉన్నట్టుండి బోర్డు తిప్పేసింది. ఎప్పట్లాగే విధులకు వచ్చిన ఉద్యోగులు ఆఫీస్ కి తాళం వేసి ఉండటంతో షాక్ అయ్యారు. యాజమాన్యానికి ఫోన్‌ చేయగా. వారం రోజులు ఆగండి. ప్రస్తుతం ప్రాజెక్టులు లేవు అని సమాధానం వచ్చింది. అలా వారాలు గడిచినా కంపెనీ మాత్రం తెరుచుకోలేదు. ఇంతకూ.. వారికి ఆ ఉద్యోగం ఊరికే రాలేదు.

ఒక్కొక్కరు నుంచి అక్షరాల రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు. ఒక్కసారిగా కంపెనీ బోర్డు తిప్పేయడంతో మోసపోయామని తెలుసుకున్న ఉద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌కే తలమానికమైన ఐటీ కారిడార్‌లో ఇలా వారం రోజుల వ్యవధిలో మొత్తం నాలుగు స్టార్టప్‌ కంపెనీలు బోర్డులు తిప్పేశాయి. ఫలితంగా 250 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు.
Powered by Blogger.