జూన్‌ 30 తర్వాత వాట్సాప్‌ బంద్‌!


తమ బంధువులు, స్నేహితులతో నిత్యం టచ్‌లో ఉండటానికి ఇప్పుడు చాలామందికి వాట్సాప్‌ నిత్యావసర సాధనంగా మారిపోయింది. ఈ యాప్‌ను తమ వ్యాపార, వాణిజ్య అవసరాలకు ఉపయోగించేవారు కూడా ఉన్నారు. వాట్సాప్‌ ఈ మధ్య కాలంలో అనేక ఆధునిక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్తగా ‘స్టేటస్‌’ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త కొత్త ఫీచర్లు చాలా ఆకట్టుకున్నాయి. అంతేకాదు, తన యూజర్లకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు వాట్సాప్‌ సిద్ధమవుతోంది. ఈ మేరకు అనేక నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్‌ ఒక్కసారిగా పనిచేయడం ఆగిపోతే ఎలా ఉంటుంది? ఊహించుకోవడం కష్టమే కదా. కానీ కొందరు యూజర్లకు ఈ బాధ తప్పకపోవచ్చు.

వాట్సాప్‌ ఫీచర్లను విస్తరిస్తున్న సమయంలో కొన్ని మొబైల్‌ డివైజ్‌లలో వాట్సాప్‌ పనిచేయకపోవచ్చునని, 2016 చివరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గత సంవత్సరమే ఈ విషయమై కంపెనీ ఒక అధికారిక ప్రకటన చేసింది. అయితే, దీనిపై కొంత అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయాన్ని వాట్సాప్‌ ఈ ఏడాది జూన్‌ 30వరకు వాయిదా వేసింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ నిర్ణయం అమలు కాబోతుంది.

ఈ నిర్ణయం అమలైతే.. చాలావరకు ఫోన్లలో వాట్సాప్‌ సపోర్ట్‌ చేయకపోవచ్చు.

కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపిన ప్రకారం.. ఈ ఫోన్లలో జూన్‌ 30 తర్వాత వాట్సాప్‌ సపోర్ట్‌ అవ్వకపోవచ్చు.
• బ్లాక్‌బెర్రీ (బ్లాక్‌బెర్రీ 10 సహా)
• నోకియా ఎస్‌40
• నోకియా సింబియన్‌ ఎస్‌60
• ఆండ్రాయిడ్‌ 2.1 , ఆండ్రాయిడ్‌ 2.2
• విండోస్‌ ఫోన్‌ 7.1
• ఐఫోన్‌ 3జీఎస్‌/ఐవోఎస్‌ 6

ఈ వెర్షన్‌ ఫోన్లు ఉన్నవాళ్లు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకొని వాట్సాప్‌ సేవలను మాములుగా వినియోగించుకోవచ్చని కంపెనీ అప్పట్లోనే చెప్పింది. విండోస్‌ యూజర్లకు చాట్‌ డాటాను ఆర్గనైజ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ఈ ఫీచర్‌ ఉంటే.. ఫొటోలు, జిప్‌లు, వీడియోలు, మెసేజ్‌లు యూజర్లు తమకు నచ్చినట్టు ఒకేచోట ఉంచుకోవచ్చు.
Powered by Blogger.