జీసస్ క్రిస్టియన్ కాదు.. బయటపడ్డ 2 వేల ఏళ్ళ నాటి జీసస్ అసలు రూపం ఇదే
ఈ లోకాన్ని పరలోకంగా మార్చే ప్రయత్నాలు చరిత్రలో ఎన్నో జరిగాయి. అడపాదడపా కనిపించే మార్పులే తప్ప అవేవీ సఫలం కాలేదు. అయితే ఒక మహా ప్రయత్నాన్ని దేవుడే పూనుకొని రెండువేల ఏళ్ల క్రితం బెత్లెహేమునే ఆరంభ కేంద్రంగా చేశాడు. మరియ, యోసేపు అనే నిరుపేద జంటకు జగద్రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వరంగా బెత్లెహేములో జన్మించాడు. యేసు జననంతో స్వార్థం, భయం, అనే రెండు రెక్కలతో విస్తరిస్తున్న చీకటి రాజ్యం రెక్కలు విరిచినట్లయింది. ప్రేమ, క్షమాపణ ప్రాతిపదికగా యేసు వెలుగు ఆరంబించాడు.
ఉదయం లేచినవెంటనే, యేసు ప్రభువు వారి ఫోటో చూసుకోవడం చాలామందికి ఒక అలవాటు.ఇంతకీ ఆ ఫోటో యేసు ప్రభువు వారిదేనా? ఎవరు తీసారు?ఒక్క విషయం ఆలోచించు! యేసు ప్రభువు వారు జన్మించి రెండు వేల సంవత్సరాలు దాటిపోయింది. కెమెరా కనిపెట్టి రెండు వందల సంవత్సరాలు కూడా కాలేదు.
లియోనార్డ్ డావెన్సి 'ది లాస్ట్ సప్పర్' అనే అద్భుతమైన చిత్రంలో ఏసుప్రభువు వారు తన శిష్యులతో పస్కా ను భుజిస్తున్నట్లు చిత్రించాడు. ఆయన యేసు ప్రభువు వారిని చూసాడా అంటే? లేదు. యేసు ప్రభువు పుట్టిన 1400 సంవత్సరాల తర్వాత పుట్టాడు.
యేసు ప్రభువును స్వయంగా చూచిన చిత్రకారుడెవరైనా ఆయన చిత్రాన్ని గీసారా అంటే? అట్లా జరగలేదు.
యేసు ప్రభువుగా చెప్పుకొంటున్న ఆ రూపం ఈలోకంలోనికి ఎట్లా వచ్చింది?యేసు ప్రభువు వారు సిలువ మీద మరణించిన తర్వాత ఆయన దేహం అరిమతయి యోసేపుకు ఇవ్వబడింది. అప్పుడు ఆయన ముఖాన్ని తెల్లని వస్త్రంతో తుడవగా, ఆయన ముఖస్వరూపం రక్తపు మరకల రూపంలో దాని మీద ముద్రించ బడింది.
తర్వాతి కాలంలో ఆ ముద్రికలను ఆధారం చేసుకొని 'బహుశ' యేసు ప్రభువు రూపం ఇట్లా వుండవచ్చేమో? అని ఒక ఊహా చిత్రం గీసారు. ఆ ఊహా చిత్రమే దేవుడై పోయాడు. దానినే మందిరాలలోనూ, గ్రుహాల్లోనూ పెట్టుకొని ఆరాదిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా మనకు తెలియని, విశేషాలు ఎన్నో చరిత్ర పుటల్లో కనుమరుగైపోయాయి, అయితే ఆయా రంగాలకు చెందిన నిపుణులు మనకు తెలియని కొత్త విషయాలను ఎప్పటికప్పుడు కనిపెట్టి చెబుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది, అదీ జీసస్ గురించి. సుమారు 2వేల ఏళ్ల నాటి పుస్తకాల ద్వారా జీసస్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను నిపుణులు గుర్తించారు. అవేమిటంటే…
జోర్డాన్ అనే దేశంలో ఈ మధ్యే 70 పుస్తకాలు పురాతత్వ శాస్త్రవేత్తలకు దొరికాయి. వాటిల్లో ఉన్న ఓ పుస్తకం మాత్రం సుమారు 2వేల ఏళ్ల నాటిదట. సీసం, ఇతర పదార్థాలు కలిపి రేకుల్లా ఉండే కాగితాలతో తయారు చేసిన ఆ పుస్తకం క్రెడిట్‌కార్డు సైజులో ఉంది. స్పైరల్ బైండింగ్ బుక్‌లా దాన్ని తయారు చేశారు. ఆ పుస్తకంలోని రేకు కాగితాలపై పలు పదాలు, అక్షరాలు, బొమ్మలు, చిహ్నాలు ఉన్నాయి. వాటిని శోధించిన నిపుణులు పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలను ఒకసారి చూద్దాం.
జీసస్ ఇప్పటి వరకు ఓ క్రిస్టియన్ అని చెబుతూ వచ్చారు కానీ ఆయన క్రిస్టియన్ కాదట. యూదు తెగకు చెందినవాడట. సుమారుగా 1000 సంవత్సరాల నాటి నుంచి మరుగున పడిన యూదు సంస్కృతిని తిరిగి పునరుద్ధరించే పనికి పూనుకున్నాడట. ఆ సమయంలో డేవిడ్ అనే రాజు పరిపాలిస్తున్నట్టు పైన తెలిపిన ఆ పుస్తకంలో ఉంది. ఇక జీసస్ అంటే మగ దేవుడు అని అందరూ భావించారు కానీ అలా కాదట. జీసస్ స్త్రీ, పురుషులు ఇద్దరినీ ప్రతిబింబిస్తాడట. ఇద్దరి అంశలు ఆయనలో ఉన్నాయట.
సదరు పురాతన పుస్తకంలో జీసస్ బొమ్మ అస్పష్టంగా ఉందని నిపుణులు తేల్చారు. కాగా అందులో జీసస్ నిజమైన బొమ్మ ఉందని అంటున్నారు. ఈ పుస్తకం 2వేల ఏళ్ల నాటిదని సైంటిస్టులు పక్కాగా చెబుతున్నారు. అందులో రాయబడి ఉన్న కొన్ని పదాలు, అక్షరాలు పాలియో, హిబ్రూ అనే భాషల్లో ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఇదంతా వట్టిదే అని మరి కొందరు వాదిస్తున్నారు.!