ఏపీ ఓటర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్.. వీడికి మూడినట్లే

ఇటీవల పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ టాక్ ఆఫ్ ది టౌన్ అయిన విషయం తెల్సిందే. కత్తి మహేష్‌ను పవన్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో బెదిరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కత్తి మహేష్ నెంబర్‌ను షేర్ చేసుకుంటూ, నిమిషం నిమిషానికి కత్తి మహేష్‌కు పవన్ ఫ్యాన్స్ బెదిరింపు ఫోన్‌లు చేస్తున్నారు.
ఇష్టం వచ్చినట్లుగా కత్తి మహేష్‌ను పీకే ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ తనపై చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు కత్తి మహేష్ కూడా చాలా గట్టిగా సమాధానం ఇస్తున్నాడు. తాజాగా ఒక వెబ్ మీడియాకు ఈయన ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సందర్బంగా ఏపీ ఓటర్లపై కూడా ఈయన షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.
ఏపీ ఓటర్లు చాలా కన్ప్యూజ్‌లో ఉన్నారు. అధికార పార్టీ టీడీపీ ఇచ్చిన హామీలను నిలుపుకోలేక పోయింది. సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులు అసంపూర్తిగా ఉంటున్నాయి. మరో వైపు ప్రతిపక్షం వైకాపా కూడా పెద్దగా ప్రభావం చూపించలేక పోతుంది. జగన్ వస్తే ఏపీ అభివృద్ది చెందుతుందనే నమ్మకం ప్రజల్లో లేదు.
ఇక పవన్ కళ్యాణ్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఈ సమయంలో ఈ ముగ్గురిలో ఎవరిని ప్రజలు ఎన్నుకోవాలో గందరగోళంలో ఉన్నట్లుగా కత్తి మహేష్ విశ్లేషించాడు. మూడు పార్టీలు కూడా ప్రజల పూర్తి విశ్వాసంను పొందలేక పోతున్నాయని ఆయన వ్యాఖ్యలు చేశాడు. కత్తి మహేష్ చేస్తున్న విమర్శలకు అన్ని పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహంను వ్యక్తం చేశారు. రాజకీయం గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు అంటూ సంచలన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కత్తి మహేష్ మరోసారి చర్చనీయాంశం అయ్యాడు.