లంగాలోకి చేయివెళ్లడంతో రాధిక కొట్టింది: చిరంజీవి లక్కే, పవన్ ఓరేయ్...!


ఒకప్పుడు తెలుగులో టాప్ కమెడియన్లలో ఒకరిగా వెలుగొందిన హాస్యనటుడు సుధాకర్ అనారోగ్యం కారణంగా చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి తేరుకున్న ఆయన మళ్లీ సినిమా రంగం వైపు అడుగులు వేస్తున్నారు. సాయి రామ్ శంకర్ హీరోగా తెరకెక్కుతున్న 'వాడు నేను కాదు' అనే చిత్రంలో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్ సినిమా ప్రయత్నాలు చేసే సమయంలో ఒకే రూములో ఉండే వారు. ఆ మధ్య ఓ సారి సుధాకర్ తన తొలిరోజుల గురించి గుర్తు చేసుకుంటూ నేను, చిరంజీవి, హరి ప్రసాద్ ఒకే రూములో ఉండేవారం...చిరంజీవి అన్నం వండేవాడు, తాను కూరలు చేసేవాడిని, మార్కెట్ నుండి కావాల్సిన హరి ప్రసాద్ తీసుకువచ్చేవాడని సుధాకర్ చెప్పుకొచ్చారు.

సుధాకర్ నటిస్తున్న రీ ఎంట్రీ మూవీ 'వాడు నేను కాదు' మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ జీవితంలోని మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్పకొ చెప్పుకొచ్చారు.

రాధిక తనపై చేయి చేసుకున్న సంఘటన గురించి... తమిళంలో నేను హీరోగా చేస్తున్న రోజులు. రాధికతో తొలి సినిమా. ఆమె ఎం.ఆర్.రాధ గారి కూతురు కావడంతో కాస్త భయంగా ఉండేది. అప్పటికే వాళ్ల నాన్న ఒకర్ని గన్ తో షూట్ చేసిన విషయం అప్పట్లో ఓ సెన్సేషన్. ఆయన కూతురుతో నేను సినిమా చేస్తుండటంతో సెట్లో అంతా కాస్త జాగ్రత్తగా ఉండాలని అనేవారు. మా ఇద్దరి మధ్య తొలిసీన్ రాధిక పరుగెత్తుకుంటూ నా దగ్గరికి రాగానే నేను ఎత్తుకుని తిప్పాలి. అయితే ఆమెను ఎత్తుకున్న సమయంలో అనుకోకుండా నా చేయి ఆమె లంగాలోకి వెళ్లింది. దీంతో రాధికకు కోపం వచ్చి నా చెంపపై గట్టిగా కొట్టింది. తొలిరోజు షూటింగులోనే ఇలా అయిందేంటి అని షాకయ్యాను. షూటింగ్ బాగా రావడానికి తమ మధ్య సాన్నిహిత్యం పెరిగాలని కలిసి సినిమాలకు వెళ్లడం, కలిసి డిన్నర్ కు వెళ్లడం లాంటివి చేయాలన్నారు. తర్వాత ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. 13 సినిమాల్లో కలిసి నటించాం అని సుధాకర్ చెప్పుకొచ్చారు.

స్లైడ్ షోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, రాజమౌళి గురించి.... తన ఆరోగ్యం గురించి సుధాకర్ చెప్పిన విశేషాలు.

Powered by Blogger.