స్కూల్ లో ఆడపిల్లలకు బ్లూ ఫిలిమ్స్ చూపించి దారుణానికి ఒడిగట్టాడు

విద్యార్ధులకు పాఠాలు చెప్పాల్సిన బడిలో బూతు చిత్రాలను చూపిస్తున్నాడు. విధ్యర్దులనే క్రమ శిక్షణలో పెట్టాల్సిన గురువే దారి తప్పాడు. ఇది తెలిసిన తల్లి తండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ టీచర్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కోరటగెరె తాలుకా లంకేనహళ్ళి ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.
లంకేనహళ్ళి ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న దేవరాజ్ ఎప్పుడు తన మొబైల్ చేతిలో పెట్టుకుని బాలికలను దగ్గరకు తీసుకుని అందులోని అశ్లీల చిత్రాలను చూపిస్తున్నాడని... వాటిని చూడడానికి అయిష్టత తెలిపిన బాలికలను కొడుతుంటాడని చెప్తున్నారు.

అంతేకాకుండా బాలికలతో దగ్గరకు తీసుకుని వాళ్ళతో చనువుగా ప్రవర్తిస్తుంటాడని, ప్రత్యేకించి అమ్మాయిలతోనే ఎక్కువగా మాట్లాడతాడని అంటున్నారు. ఇంకా, ఆ దృశ్యాలుపై తమ అభిప్రాయాలు చెప్పమంటూ విసిగిస్తున్నాడు. ఇతడి చేష్టలు తార స్థాయికి చేరడం వలన తట్టుకోలేని విద్యార్ధులు ఇంటికి వెళ్లి అతడు చేసే ఉదంతం మొత్తం చెప్పారు. దేవరాజ్ చేష్టలతో విద్యార్థినిలు స్కూల్ కు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాటశాలలో జరుగుతున్న ఈ వ్యవహారంపై విద్యార్థుల కుటుంబ సభ్యులు సమావేశమై... దేవరాజ్ కు తగిన గుణపాఠం చెప్పాలని లేకపోతే మా పిల్లల భవిష్యత్తు పాడవుతుందని ఒక నిర్ణయం తీసుకున్నారు. వెంటనే విద్యార్థుల కుటుంబ సభ్యులు ఒక్కటై స్కూల్ ముందు ఆందోళనలు చేస్తున్నారు.

తుమకూరు జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి బలంతోనే కామాంధుడు దేవరాజ్ ఆగడాలు మితిమీరుతున్నాయని విద్యార్థుల కుటుంబ సభ్యులు అంటున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పడం తప్పా ఇతడు అన్ని పనులు చేస్తున్నాడని... దేవరాజ్ ను వెంటనే సస్పెండ్ చేసే వరకు మా పిల్లలను స్కూల్ కు పంపించమని విద్యార్థుల కుటుంబ సభ్యులు తెలిపారు.
టీచర్ దేవరాజ్ కు నేరచరిత్ర ఉందని.. క్యాతసంద్ర పోలీస్ స్టేషన్ లోని రౌడీషీటర్ల జాబితాలో దేవరాజ్ పేరు ఉందని.. రౌడీషీటర్ జాబితాలో పేరు ఉన్న వ్యక్తిని ప్రభుత్వం ఎలా టీచర్ గా నియమించిందని... ఇదంతా రాజకీయ బలమే అంటూ విద్యార్థుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
టీచర్ దేవరాజ్ ను వెంటనే సస్పెండ్ చెయ్యాలని, లేదంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ భారి ఎత్తున ఉద్రిక్తతలు చేపట్టారు. ఈ సమాచారం తెలుసుకున్నపోలీసులు, విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి లంకేనహళ్ళి గ్రామం చేరుకుని విద్యార్థుల కుటుంబ సభ్యులకు స్థిమిత పరుస్తున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులు, పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.