REAL STORY: అశ్విని డాటర్ ఆఫ్ సెక్స్ వర్కర్.!
తల్లి సెక్స్ వర్కర్… పడుపు వృత్తిలో వచ్చిన ఆ డబ్బులతోనే కూతుర్ని పెంచేది. కానీ ఆమెకు కోపం ఎక్కువ…ఈ క్రమంలోనే చిన్న చిన్న కారణాల రీత్యా కూతుర్ని విపరీతంగా కొట్టేది. తల్లి హింసలకు తట్టుకోలేక ఐదేళ్ళ వయస్సులో ఇంటి నుండి పారిపోయింది అశ్విని. అలా ఇంటి నుండి పారిపోయిన అశ్విని ఓ NGO లో చేరింది. అక్కడ కూడా చిత్రహింసలకు గురైంది …అదే సమయంలో అశ్విని తల్లి చనిపోయింది.ఆ NGO పెడుతున్న అనేక కష్టాలను అలాగే భరించిన అశ్విని ఓ రోజు తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ NGO నుండి క్రాంతి అనే ప్రాంతానికి పారిపోయింది.
అక్కడి ఓ స్వచ్చంద సంస్థలో చేరిన అశ్విని ఫోటోగ్రఫీ, థియేటర్ ఆర్ట్స్, డాన్స్, ఆర్ట్, థెరపీలలో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే అనేక మంది క్యాన్సర్ పేషెంట్స్ కు కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో ధైర్యాన్ని నింపింది. ఇలా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సేవచేయాలన్న ఆలోచనతో ఆమె న్యూయార్క్ యూనివర్శిటీకి దరఖాస్తు చేయగా అక్కడ సీటు లభించింది. స్కాలర్‌షిప్ ఇస్తామని ఆ యూనివర్శిటీ అశ్వినీకి భరోసా ఇచ్చింది. స్కాలర్‌షిప్ ట్యూషన్ ఫీజుకు సరిపోతుంది. కానీ అక్కడ ఉండేందుకు హాస్టల్ ఫీజు, తిండికి సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఫేస్ బుక్ పేజ్ ద్వారా పోస్ట్ చేయగా…నెటీజన్లు స్పందించారు…తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించి.. అశ్వినికి కావాల్సిన 10 లక్షల సమకూర్చారు.!
ఈ సందర్భంగా ….తనకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ…..NGO నుండి పారిపోయానని ఇప్పటికీ పోలీసులు తనకోసం వెతుకుతున్నారని , ఇక పరుగులు తీయడం ఆపేస్తానని నవ్వుతూ చెప్పింది అశ్విని.